Tuesday 8 October 2019

అందమైన కందాలు

ఓం శ్రీ సాయిరాం
అందమైన కందాలు 



కం. వందనము తెలుగు తల్లీ 
అందరమూ జేతులెత్తి దండము సేయన్
కందమునేమని చెప్పుదు
సుందరముగ పాదమమరె సొగసుల తోడన్


కం. జయము జయము గురువులకును
దయతో భారతి వచింప పలికిన కందం
లయ జేతును మీ తోడుగ
నయమే నే  మేలుకొంటి నలుగురితోడన్


కం. కలగా మిగిలిన కందము
జల జలమని వలచి వచ్చి ఝరిలో జేరెన్
ఇలపై నిలవని మనసున
తొలగాలిక తెరలమబ్బు తరుణంబిదియే

రచన
చంద్రమౌళి రెడ్లం
పలమనేరు

3 comments:



  1. బృందము శంకరునికెడన్
    డెందం బారంగ రమ్మ రివ్వన నిపుడే
    విందారగింపు రీతిని
    ఛందమ్మును చంద్రమౌళి చక్కగ నేర్వన్!


    వెల్కం బెకబెక మా బృందమునకు -


    https://kandishankaraiah.blogspot.com


    జిలేబి

    ReplyDelete