ఓం శ్రీ సాయిరాం
కంద పద్యం
కం. వచ్చిన స్వాతంత్ర్యమ్మును
ముచ్చటగా జరుపుకొనిరి పుడమిని జనులున్
తెచ్చిన వీరుల గాధలు
మెచ్చుట గాదిది భవితను మేల్కోవలెనన్
రచన
చంద్రమౌళి రెడ్లం
పలమనేరు
నా రచనలు తెల్ల కాగితాలపై నడిచే నల్లటి సిరా అక్షరాలు కాదు నా హృదయ పంజరంలో గాఢ నిద్రలో ఇన్నేళ్ళు విశ్రమించిన ఆశాకిరణాలు. ముసిరే కాళ రాత్రిని కసిరే మిణుగురులు, ఎగసి పడే కెరటాలు, నలు దిక్కులు తిరిగే విహారాలు, తొలి సంధ్యలో కిరణాలు, మలి సంధ్యలో పరిచే ఎర్రటి తివాచీలు, ఇరు సంధ్యల కదలాడే నా అంతరంగాలు. శ్రుతి తప్పిన హృదయాలను సరిచేసే కవనాలు, గతి తప్పిన అడుగులను శ్రుతి చేసే మేలుకొలుపులు.అవే నా అక్షరాలు. --రెడ్లం చంద్రమౌళి